Grant of Mining Lease
రంగారెడ్డిజిల్లా,
మార్పల్లే మండలములోని సిరిపురం గ్రామములో 5000 హెక్టార్లలో గల ఇనుము మరియు
అల్యూమినియం ఖనిజములు సంవత్సరమునకు హెక్టారుకు రు.5/-చొప్పున లైసెన్స్ ఫీజుగా
చెల్లించి, 3 సంవత్సరముల పాటు తవ్వుకొనుటకు శ్రీ ఏ.రఘునాథరావు గారికి జి.వో.నెం.
105 ద్వారా అనుమతి ఇవ్వడం జరిగింది.
కర్నూలు
జిల్లా ఉరవకల్లు మండలం లోని కేతవరం గ్రామంలో 21 హెక్టార్లలోగల సిలికాన్ ఇసుక మరియు
స్పటిక గనులను సయ్యద్ బాషాగారికి 20 సంవత్సరములపాటు లీజుకు ఇవ్వబడినది. ఇసుక
అమ్మకముపై 8శాతము పన్నువసూలు చేయబడును. డెడ్ రెంట్ గా రెండవఏట రు.200/-, మూడవ ఏట
రు.500/-, నాలుగోఏటనుండి రు.1000/-చొప్పున ప్రతిఏటా వసూలు చేయబడును. సర్ఫేస్
రెంటు, నీటి చార్జీలు ప్రభుత్వము ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారము
వసూలు చేయబడును.
బంగారము,
వెండి, రాగి, సీసము, తుత్తునాగము తదితర గనులలో దొరుకు పదార్థములను తుగ్గాలి మండలం
, కర్నూలు జిల్లాలోగల పగడ్రాయ గ్రామం, జొన్నగిరి గ్రామం, యర్రగుడి గ్రామంలలో గల 597
హెక్టార్ల వైశాల్యము గల ప్రాంతములోని గనులను 30 సంవత్సరముల పాటు జియో మైసూరు
కంపెనీకి అనుమతించడమైనది. రాయల్టీగా బంగారంపై 2శాతం,3.3శాతము, వెండిపై
7శాతము,5శాతము, రాగిపై 4శాతము, సీసముపై 7శాతము, 12.7శాతము, జింకుపై 8శాతము,
8.4శాతము చొప్పున వసూలు చేయబడును. డెడ్ రెంట్ గా రెండవ సంవత్సరమునకు హెక్టారుకు
రు.200 చొప్పున , మూడునాలుగు ఏళ్ళకు రు.500/-చొప్పున,
ఐదవ ఏటనుండి రు.1000/- ల చొప్పున వసూలు చేయబడును. సర్ఫేస్ రెంటు, నీటి చార్జీలు
ప్రభుత్వము ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారము వసూలు చేయబడును. దీనిని
ప్రభుత్వకార్యదర్శి సవ్యసాచి ఘోష్ జారీ చేశారు.
నల్గొండ జిల్లా లోని సైదులునామా రిజర్వు అడవిలో నున్న సున్నపురాయి గనులను 183 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని డక్కన్ సిమెంట్ కంపెనీకి త్రవ్వుకోవటానికి ప్రభుత్వం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అయిన శామ్యూల్ గారిచే అనుమతి ఇవ్వబడింది..
--------------------------
10-10-2010
ఖమ్మం జిల్లాలోని బయ్యారం మండలం కిష్టాపురం
గనుల నుండి 20 సంవత్సరాలపాటు, 4.989 హెక్టార్ల భూమిలో దొరికే క్వార్జ్ ని
త్రవ్వుకొనుటకు శ్రీ వట్టం కన్నయ్యగారికి అనుమతి మంజూరు చేయబడినది. అమ్మకంపే 15శాతం
రాయల్టీ వసూలు చేయబడును. డెడ్ రెంట్ క్రింద రెండవయేడు రు.200/-, మూడు,నాలుగు
ఏళ్ళకు గాను రు.500/-చొప్పున, ఐదవ ఏటనుండి రు.1000/-ల చొప్పున వసూలు చేయ బడును.

Post a Comment