New PHC with the help of Reliance
హైదరాబాదులోని ప్రజా ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ శాఖ
డైరెక్టరు గారు
తూర్పుగోదావరి జిల్లా , తాళ్ళరేవు మండలంలోని గడిమోగ
అనే గ్రామములో ఒక ప్రాధమిక
ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు
ప్రకటించారు.
దీనికి సి.యస్.ఆర్. అనే
సంస్థకు చెందిన రిలయన్స్ కంపెనీ
వారు ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించుటకు
అంగీకరించారు. ఈ హాస్పటల్
నిర్మాణము వల్ల గడిమోగ గ్రామంతో పాటుగా పోలెకర్రు,
పి.మల్లవరం,
భైరవపాలెం గ్రామాలలో నివసించే 25000 మంది ప్రజలకు వైద్యసేవలు
అందుతాయని ఆశిస్తున్నారు. ఈ ఆసుపత్రి ఐపిహెచ్చిఎస్ వారి స్థాయిలో
ఏ.పి.యం.యస్.ఐ.డి.సి.
సహకారంతో నిర్మించబడుతుంది. రిలయన్స్
కంపెని వారు ఈ ఆసుపత్రికి కావలసిన పరికరాలు
సమకూరుస్తామని, ఈ
ఆసుపత్రి నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులకుగాను ప్రతిఏటా రు.20
లక్షలు చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఆవిధంగా దీనిని నిర్మించి వైద్య
ఆరోగ్య
శాఖవారికి అప్పగించారు.
ప్రభుత్వము దీనికి 8 పోష్టులు మంజూరు చేసింది. జీతాల క్రింద
రు.34,88,381/-,
మందులు, శస్త్రచికిత్సల పరికరాలకు, లెనిన్, డైట్
ఖర్చులకు రు.5 లక్షలు మంజూరు చేశారు.
( నిర్వహణ ఖర్చులకు
అవసరమైన రు.20 లక్షలను రిలయన్స్ కంపెనీ వారు అందిస్తారు)


Post a Comment